Dear Customer *The Reason you should buy this amazing book*
ప్రపంచ ప్రసిద్ధ కాస్మాలజిస్ట్, ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’ అనే నంబర్ వన్ బెస్ట్ సెల్లింగ్ పుస్తక రచయిత, తన మరణానంతరం వెలువడిన ఈ పుస్తకం ద్వారా ‘విశ్వంలోని అన్నింటికన్నా పెద్ద ప్రశ్నల’ గురించిన తన తుది అభిప్రాయాలను మనకు వదిలారు. విశ్వం ఎట్లా మొదలయింది? మానవులు భూమి మీద మనగలుగుతారా? సౌర వ్యవస్థకు అవతల బుద్ధిజీవులు ఉన్నారా? కృత్రిమజ్ఞానం మనలను ఓడిస్తుందా? తన పరిశోధన కాలం మొత్తంలోనూ స్టీఫెన్ హాకింగ్, విశ్వం గురించిన మన అవగాహనలను విస్తరింపజేశాడు. కొన్ని మహత్తర రహస్యాలు గుట్టువిప్పాడు. బ్లాక్ హోల్స్, ఊహాకాలం, పెక్కు చరిత్రలు లాంటి అంశాల గురించి తన ఆలోచనలను విశ్వంలోని సుదూర ప్రాంతాలకు పరుగెత్తించాడు. అయినా భూమి మీద సమస్యలకు సమాధానాలు అందించడంలో విజ్ఞానశాస్త్రం కీలకపాత్ర పోషిస్తుంది అన్నాడు. వాతావరణం మార్పులు, అణుయుద్ధ భయం, ఆర్టిఫీషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి వంటి ప్రమాదకరాలయిన మార్పులవేపు ఇక ప్రస్తుతం, తన దృష్టి సారించాడు. పెద్ద ప్రశ్నలు వాటికి చిన్న సమాధానాలు అన్నది చరిత్రలోనే సాటిలేని మెదడు నుంచి వచ్చిన చివరి పుస్తకం. విస్తృత విషయాలను గురించి, ప్రేరణాత్మకంగా, అతని సహజమయిన హాస్యం జొప్పిస్తూ, మానవజాతిగా మనం ఎదురుకుంటున్న సమస్యల గురించి, ఒక గ్రహంగా మునుముందు మనం ఎటు పోతున్నాము అన్న విషయం గురించి హాకింగ్ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పిన పుస్తకం యిది.
About the Author
Product details
Publisher : Manjul Publishing House
Language : Telugu
Paperback : 171pages
ISBN-10 : 9390085942
ISBN-13 : 9789390085941
Item Weight : 200g
Dimensions : 20 x 14 x 4 cm
Country of Origin : India